స్టార్ హీరోలపై ఉండే అభిమానం కొన్ని సందర్భాలలో అనర్ధాలకు దారితీసినప్పటికీ చాలా సందర్భాలలో మంచికి పనులకు ఉపయోగపడుతుంది. కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్, సొసైటీలో సహాయం కొరకు ఎదురు చూసే కొందరు నిస్సహాయుల కొరకు ఎన్టీఆర్ పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ చారిటబుల్ సర్వీసెస్ పేరుతో ఈ సంస్థ ఏర్పాటు కానుంది. ఈ సంస్థ ద్వారా పేద, బడుగు బలహీన వర్గాల వారికీ, వారి శక్తిమేర సహాయం అందించనున్నారు. త్వరలోనే ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు దేశవ్యాప్తంగా హీరోలు, వారి అభిమాన సంఘాలు ప్రజలకు సేవ చేస్తూ సామజిక భాద్యత నెరవేర్చుతున్నాయి. ఏమైనా ఇది శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఇక ఎన్టీఆర్ 2019 ని ఎటువంటి చిత్రం విడుదల చేయకుండానే ముగించాడు. ఆయన రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది జులై 30న ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల కానుంది .
Comments
Post a Comment